మునగాల : బాల్య మిత్రులు.. ఎంత మంచి వారో..!

మునగాల : బాల్య మిత్రులు.. ఎంత మంచి వారో..!

మునగాల , మనసాక్షి
వారంతా చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుతున్నారు. పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదువుకున్న చిన్ననాటి మిత్రుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో స్నేహితులు చెలించి పోయారు. ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

 

Also Read : Telangana | ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పు.. టైమింగ్స్ ఇదే..!

 

వివరాలకు వెళ్తే .. 1997 సంవత్సరంలో మునగాల హై స్కూల్ లో 10వ తరగతి చదువుకున్న మిత్ర బృందం, బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన తమ మిత్రుడు లంజపల్లి మంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఎలాగైనా మిత్రుని కుటుంబానికి అండగా ఉండాలని సంకల్పించుకొని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనేంత సహాయం చేయాలని నిర్ణయించారు.

 

Also Read : CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!

 

ఈ మేరకు లక్ష రూపాయల నగదు సేకరించి ఇంటి స్థలం కొనుగోలు చేసి తమ మిత్రుడు భార్య రేణుక కు శనివారం రాత్రి దస్తావేజులను అందజేసి స్నేహబంధం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు గంధం రాము, నారగాని కృష్ణ, ఆనంతుల వెంకట రామనర్సయ్య, పాశం పవన్, జిల్లేపల్లి సతీష్, జంగిలి గోపి, గంజి నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!