ఆటల్లో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి

బిఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్

ఆటల్లోజిల్లాకు గుర్తింపు తీసుకురావాలి

బిఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్

సూర్యాపేట , మనసాక్షి

క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకుగుర్తింపుతీసుకురావాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 7వ వార్డులో ఈనెల 15 నుంచి 18 వరకు హైదరాబాదులో జరిగే ఖాల్స సాజన్ దివాస్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ కు సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి హాజరవుతున్న సూర్యాపేట ఖాల్స కింగ్ టీంకు క్రీడా దుస్తులను, క్రికెట్ కిట్టును అందజేసి మాట్లాడారు.

ALSO READ : Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట తరఫున టోర్నమెంట్ విజేతలుగా గెలుపొందాలన్నారు. ఇప్పటికే ఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేలా తనవంతు ఆర్థిక సాయం చేస్తున్నానని అన్నారు.

ALSO READ : సూర్యాపేట : ఎలుగుబంటి కలకలం  (వీడియో వైరల్)

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు సాజిద్ ఖాన్, పిడమర్తి కళ్యాణ్,కృష్ణ, ఉపేందర్, దశరథ, వెంకన్న, ఏడవ వార్డు సభ్యులు బచ్చన్ సింగ్, అమృత్ సింగ్, లక్ష్మణ్ సింగ్, కిర్ పాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.