అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం

వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని యూత్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామంలోని 12వ వార్డు బొడ్రా సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని యూత్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామంలోని 12వ వార్డు బొడ్రా సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

ALSO READ : మిర్యాలగూడ : ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి..!

అన్నదాన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రెడ్డి వెంకట్ రెడ్డి, పిండి సతీష్ రెడ్డి, గుంటి సురేష్, చీమల నరేష్, శీలం సైదులు, శీలం నాగయ్య సహాయ సహకారంతో 500 మందికి అన్నదానానికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.

అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డెకరేషన్ మరియు టెంట్ హౌస్ దాత ధరణికోట నాగరాజు విజయలక్ష్మి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శీలం లింగయ్య, శీలం బద్రి,వీరయ్య, బక్కయ్య, కమిటీ సభ్యులు శీలం లింగస్వామి, శీలం సతీష్, సుమన్, వినయ్ గౌడ్, శ్రవణ్, రమాకాంత్, ప్రసాద్ , సంపత్, సందీప్ యాదవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!