మిర్యాలగూడ : ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి..!

ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటుచేసుకుంది.

మిర్యాలగూడ : ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి..!

నలుగురి అరెస్టు , రిమాండ్

వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ

మిర్యాలగూడ , మనసాక్షి :

ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటుచేసుకుంది. మైనరు బాలికను తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితోపాటు సహకరించిన మరో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేస్తూ నిందితులను గురువారం రిమాండ్ పంపినట్లు మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ తెలిపారు .

వివరాల ప్రకారం .. ఈనెల 22వ తేదీన మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం.
22 న ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకోని వెళ్లినట్టు తెలిసింది.

ALSO READ : TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

యాదగిరి పల్లి గ్రామానికి చెందిన చరన్ దీప్, అతని తమ్ముడు చరణ్ తేజ్, మిత్రులు అంజి , మహేష్ కలిసి ఆ బాలికను అడవిదేవులపల్లి మండలం సత్రశాలకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఆ మైనర్ పై లైంగిక దాడి చేసి హైదరాబాదుకు తీసుకువెళ్లారు. భయపడిన ఆ మైనర్ బాలిక ఇంటికి వెళ్తా అనగా వారు ఆ అమ్మాయిని హయత్ నగర్ లో వదిలిపెట్టి వెళ్లిపోయారు.

అప్పటికి వెతుకుతున్న తల్లిదండ్రులు పోలీసులు మైనర్ బాలికను గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న నిందితులు మంగళవారం ఉదయం అవంతిపురం వద్ద ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై నరసింహ సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నారు. ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ పంపించాము. సమావేశంలో ఎస్సై నర్సింహులు సిబ్బంది నాగయ్య, బిటి నాయక్, గోపి ,తదితరులు ఉన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

స్నేహం పేరుతో జీవితం పాడు చేసుకోకండి: 

అనంతరం సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహం పేరుతో జీవితం పాడు చేసుకోకండి.
మిత్రుడు ప్రేమించాడని మైనర్ బాలికను తీసుకెళ్లి బంగారు ను భవిష్యత్తుని యువకులు పాడు చేసుకోవద్దు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన వారి పైన కూడా ఫోక్సో చట్టం వర్తిస్తుంది. ఇది గమనించకుండా స్నేహం కోసం మిత్రుడు ప్రేమ పేరుతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. పరిణితి పెంచుకొని చట్టాలపై అవగాహనతో నడుచుకోవాలని యువతను కోరుతున్నామన్నారు.

తల్లిదండ్రులు ఆలోచించండి: 

పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనించాలి. బాధ్యత లేని పనులతో వారి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. యువత సమాజం పట్ల, చట్టాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది, లేకుంటే ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి వారి భవిష్యత్తు అగమ్య గోచరమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంది.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!