Suryapet : వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు
Suryapet : వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు
సూర్యాపేట , మనసాక్షి
వినాయక చవితి వేడుకలను సూర్యాపేట లోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !
రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, సూర్యాపేట ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశుడిని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తండ్రి గుంటకండ్ల చంద్రారెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య,
ALSO READ :; Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !
ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై . వి, ఎంపిపి నెమ్మాధి బిక్షం,ఉప్పల ఆనంద్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రౌతు నరసింహారావు, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్, ఈదుల యాదగిరి ముదిరాజ్,టీ.ఆర్.ఎస్ వి నేతలు ముదిరెడ్డి అనీల్ రెడ్డి, అనంతుల విజయ్, యలక హరీష్ రెడ్డి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.









