మిర్యాలగూడ : వినాయక ప్రతిమల వద్ద బిఎల్ఆర్ సతీమణి పూజలు..!

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో బిఎల్ఆర్ సతీమణి మాధవి, చిన్న తనయుడు ఈశ్వర్ గణేష్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి పలు వినాయక ప్రతిమల వద్ద మంగళవారం పూజలు నిర్వహించారు భక్తులను ఉద్దేశించి మాధవి మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో మనం ముందుకు వెళ్లాలని అన్నారు.

మిర్యాలగూడ : వినాయక ప్రతిమల వద్ద బిఎల్ఆర్ సతీమణి పూజలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో బిఎల్ఆర్ సతీమణి మాధవి, చిన్న తనయుడు ఈశ్వర్ గణేష్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి పలు వినాయక ప్రతిమల వద్ద మంగళవారం పూజలు నిర్వహించారు
భక్తులను ఉద్దేశించి మాధవి మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో మనం ముందుకు వెళ్లాలని అన్నారు.

వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం వలన యువత పెడదారి పట్టకుండా ఆధ్యాత్మికతను వారిలో పెంపొందించుకుంటూ మానవసేవే పరమావధిగా భావిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు . యువత అభివృద్ధి పథంలో ముందుంటే మన దేశం కూడా అభివృద్ధి పథంలో ఉంటుందని ఈ వినాయక చవితి ఉత్సవాలలో కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

మన దేశ సామరస్యతకు, లౌకికవాదానికి ఒక నిదర్శనమని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని వాటి నిమజ్జనం చేయడం తో అవి నీటిలో సులభంగా కరిగి నీటిలో ఉన్నటువంటి జీవరాసులకు ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.

అదేవిధంగా గణపతి పూజలో వాడేటటువంటి పత్రి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండడం వలన వాటి నీటిలో వేయడంతో ఆ ఔషధ గుణాలు నీటిలో కలిసి మనం ఆరోగ్యంగా ఉండడంలో ఎంత దోహదపడతాయని అన్నారు. అవిజ్ఞ వినాయకుడి కృపవలన పకృతి వైపరీత్యాల నుండి మన దేశాన్ని కాపాడిన వాళ్ళమవుతామని, అదేవిధంగా వినాయక నిమజ్జన సమయంలో ప్రతి ఒక్క మండపం వారు కూడా పలు జాగ్రత్తలను పాటిస్తూ చెరువులలో గణపతిని నిమజ్జనం చేయాలన్నారు.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలను దరికి రానివ్వకుండా జాగ్రత్తలు పాటించాలని, ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినాయక మండపాల కమిటీ వారిదే అన్నారు . కమిటీ నిర్వాహకులు పలు జాగ్రత్తలతో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి , నవయుగ యూత్ కమిటీ అధ్యక్షుడు రఘు, మట్టపల్లి శ్రీలేఖ, అంజలి, అమృత, కల్పన ,చిరుమామిళ్ల శ్రీనివాస్, దేవిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ,భాను ,ముల్లంగి లక్ష్మి , కత్రం సుభాషిని పాల్గొన్నారు.

ALSO READ :

  1. Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!
  2. Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!