Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసిద్దిపేట జిల్లా

పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..!

పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..!

దుబ్బాకలో మోడీకి పాలాభిషేకం

దుబ్బాక, మనసాక్షి : పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200, ఉజ్వల యోజన లబ్ధిదారులకు 400 తగ్గించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెలందరికీ మోదీ రక్షా బంధన్ కానుక అని దుబ్బాక బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు నవ్య శ్రీ అన్నారు.

 

ALSO READ : 

  1. Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!
  2. Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
  3. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
  4. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులకు రూ. 400 సబ్సిడీ అందించడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఈ తగ్గింపు వల్ల ప్రయోజనం పొందనున్న దేశంలో 33 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారుల తరఫున నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు .

 

వారి చిత్రపటానికి  స్థానిక దుబ్బాక బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీకి పాలభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోనాయకులు ఎస్ ఎన్ చారి, పుట్ట వంశీ, మచ్చ శ్రీనివాస్ , సుంకు ప్రవీణ్, నిహాల్ గౌడ్, బాచి, శ్రీకాంత్, భాస్కర్, రమేష్ రెడ్డి, మనోజ్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు