తెలంగాణBreaking Newsఉద్యోగంహైదరాబాద్

Hyderabad : మాల్స్, మల్టీప్లెక్స్ లపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కొరడా..!

Hyderabad : మాల్స్, మల్టీప్లెక్స్ లపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కొరడా..!

శేరిలింగంపల్లి , మన సాక్షి :

హైదరాబాదులో మాల్స్, మల్టీప్లెక్స్ లపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కొరడా ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆమె దృష్టికి రావడంతో స్వయంగా ఆమె వెళ్లి మాల్స్ ను పరిశీలించారు. మాల్స్ మల్టీప్లెక్స్ లపై నిబంధనలు పాటించే విధంగా కమిటీని ఏర్పాటు చేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని జిఎస్ఏం మాల్ తో పాటు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుండి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అట్టి విషయ మై తనిఖీలు చేయుటకు ప్రత్యేకంగా టీమ్స్ వేసినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత టీమ్ ల తనిఖీలలో కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని, మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు బయటపడిందన్నారు.

అదే విధంగా అక్కడ ఫుడ్ స్టాల్స్ ను తనిఖీ చేయగా కొన్ని చోట్ల ఫుడ్ స్టాల్ లలో అమ్ముతున్న తినుబండారాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు తెలిపారు.  ఈ నేపథ్యంలో తనిఖీలలో అక్రమాలకు గుర్తించిన ఆయా మాల్స్ కు, మల్టీప్లెక్స్ లకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయా క్షేత్రస్థాయి అధికారులకు నోటీసులు లు జారీ చేసారు.

ఇది కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 3.69 లక్షల క్యూసెక్కుల వరద.. క్రస్ట్ గేట్లను తాకనున్న నీరు, నేడు ఎడమ కాలువకు విడుదల, అప్పుడే గేట్లు ఓపెన్..!

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update

మరిన్ని వార్తలు