గొల్ల కురుమల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

గొల్ల కురుమల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

రంగారెడ్డి జిల్లా మాడ్గుల ప్రతినిధి, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్దపీట వేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే జి జైపాల్ యాదవ్ అన్నారు. మాడుగుల మండలంలోని బ్రాహ్మణపల్లి కొత్త బ్రాహ్మణపల్లి, కాశగూడెం గ్రామాలలో మంగళవారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటించారు.

 

కొత్త బ్రాహ్మణపల్లి, కాశ గూడెం గ్రామాలలో పంచాయతీ నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భూమి పూజ చేశారు. అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 48 మంది గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

ALSO READ :

  1. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

        2. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!

3. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయార న్నారు. నేడు తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికాలుగా నిలిచాయన్నారు.

 

దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచులు పులికంటి లక్ష్మయ్య, జోజమ్మ బాల్ రెడ్డి, పుష్పలత జంగయ్య యాదవ్, పోలె కళయాదయ్య, రుద్రాక్ష పార్వతమ్మ,

 

మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పగడాల రవి, ఎంపీటీసీ సభ్యులు సరితబ్రహ్మం గౌడ్, గ్యార వెంకటయ్య, మాజీ ఎంపీపీ జర్పుల జైపాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ సురమళ్ళ సత్తయ్య పాల్గొన్నారు.