TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమంహైదరాబాద్
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వారికి మాత్రమే ఈ పథకం..!
రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వారి కోసం ప్రత్యేకంగా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అర్హత ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వారికి మాత్రమే ఈ పథకం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వారి కోసం ప్రత్యేకంగా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అర్హత ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని, ఆయా కుటుంబాల యజమానులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2026 – 27వ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫ్యూచర్ స్టిక్ బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. శాసనమండలి హాల్లో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.









