Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 26న నల్గొండలో భారీ జాబ్ మేళా..!

ఈ నెల 26న నల్గొండ లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ యువతకు పిలుపునిచ్చారు.

Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 26న నల్గొండలో భారీ జాబ్ మేళా..!

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ, మన సాక్షి:

ఈ నెల 26న నల్గొండ లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ యువతకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టాస్క్ తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను సోమవారం హైదరాబాదులోని బంజరాహిల్స్ లోమంత్రుల నివాస సముదాయంలో ఆయన విడుదల చేశారు.

ALSO READ : ఫోన్ పే, గూగుల్ పే ఫై భారత ప్రభుత్వ వ్యూహం ఏంటి..!

అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండలో ప్రతీ యువతీ, యువకుడికి ఉద్యోగ ఉపాధి కలిగించేలా కృషి చేస్తానని తెలిపారు. అందుకోసం ప్రతీరోజు వివిధ సంస్థలతో సమావేశాలు జరుపుతూ.. నిజమైన సంస్థల్ని గుర్తిస్తున్నామని, వాటిలో ఉన్న ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే నల్గొండ స్కిల్ సెంటర్ ద్వారా ఒక్కో సెషన్ లో పదివేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన చేస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి,టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, సిఎఫ్ఎమ్సీ సీఈఓ సత్యనారాయణ, ప్లేస్ మెంట్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!