Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావిద్య
Narayanpet : జిల్లా కలెక్టర్ ను కలిసి డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన గోవిందరాజులు..!
Narayanpet : జిల్లా కలెక్టర్ ను కలిసి డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన గోవిందరాజులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారిగా డాక్టర్ యం గోవిందరాజులు గురువారం సాయంత్రం పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓ డాక్టర్ యం గోవిందరాజులకు కార్యాలయ పర్యవేక్షకులు నరసింహారెడ్డి, సెక్టోరియల్ అధికారులు, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాలయ అధికారులు సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఇంతకుముందు నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల డీఈవోగా పనిచేస్తూ బదిలీపై నారాయణపేట జిల్లాకు డీఈవోగా వచ్చారు.
MOST READ :
-
Gold Price : మళ్లీ పసిడి తగ్గింది.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. అయోమయంలో రైతులు..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గడువు లేదు, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి..!
-
Runamafi : రుణమాఫీ పై లేటెస్ట్ అప్డేట్.. రూ. 3వేల కోట్లు రిలీజ్..!









