రాహుకేతువులకు గ్రహణ పరిహార పూజలు

రాహుకేతువులకు గ్రహణ పరిహార పూజలు

మేళ్లచెరువు, మనసాక్షి: మేళ్లచెరువు మండల కేంద్రంలోని రాహుకేతు ఆలయంలో మంగళవారం చంద్రగ్రహణ పరిహార పూజలు జరిగాయి.గ్రహణ పరిహార దోషాల నివారణ కోసం భక్తులు పూజల్లో పాల్గొన్నారు. చంద్ర గ్రహణం ద్వారా దుష్పలితాలు రాకుండా అర్చకులు విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ పూజలు జరిపారు.గ్రహణం సందర్భంగా వేకువ పూజల అనంతరం శివాలయం ద్వారబంధనం చేశారు. కార్యక్రమంలో ఈఓ కొండారెడ్డి,సిబ్బంది కొండారెడ్డి,నర్సింహారెడ్డి,భక్తులు పాల్గొన్నారు.