Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ 

గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ 

సూర్యాపేట , మనసాక్షి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ ఎస్ పీ ఎస్ సీ) ద్వారా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సిటీ టాలెంట్ స్కూల్ చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీచేసి లోనికి అనుమతించారు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

కాగా, ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా జరిపిన వేలిముద్రల సేకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకుఅందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో 69.07 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9170 మంది అభ్యర్థులకు గాను 6334 మంది పరీక్ష రాయగా, 2836 మంది గైర్హాజరయ్యారని వివరించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లైజనింగ్ అధికారులు ఉన్నారు.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు