మిర్యాలగూడ : గృహలక్ష్మి పథకం రూ. 5 లక్షలకు పెంచాలి

మిర్యాలగూడ : గృహలక్ష్మి పథకం రూ. 5 లక్షలకు పెంచాలి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

అర్హత కలిగిన పేదలందరికీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికర్ మల్లేష్,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని వాటర్ ట్యాంక్ తండాలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ…నియోజకవర్గంలో జీవనోపాధి కోసం వివిధ గ్రామాలనుండి నుండి వలస వచ్చి వేలాది మంది అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్నారని అన్నారు.గత 20 సంవత్సరాలుగా పేదలకు ఎక్కడ ఇంటి స్థలం ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేయలేదు.అనేకచోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్న పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాటరీ తీసి లబ్ధిదారుల ఎంపిక చేసిన నేటికీ పంపిణీ చేయలేదని ఆరోపించారు.

 

మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.అందుకు బడ్జెట్ కూడా ప్రభుత్వం కేటాయించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.మండలంలోని కొన్ని గ్రామాల్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరుతున్న పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.

 

1995లో ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇండస్థలాల కోసం పంచిన భూమిని పల్లె ప్రకృతి వనాలు ,డంపింగ్ యార్డులు, స్మశాన వాటికల పేరుతో పేదల నుండి ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు.ఇండ్ల స్థలాల కోసం అవసరమైన భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

 

ALSO READ :

 

గృహలక్ష్మి పథకంలో ఇస్తున్న 3లక్షల ను 5 లక్షలకు పెంచాలని,కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలను సర్వే చేసి అర్హులందరితో దరఖాస్తులు పెట్టించమని,వాటిని ఎంక్వైరీ చేయించి అర్హుల జాబితా తయారు చేసి కావలసిన భూమిని ప్రభుత్వం కొనుగోలు చెయ్యకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

 

ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి వెంటనే పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి,అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు బడ్జెట్ కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.లాటరీ ద్వారా ఎంపిక చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు.

 

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లుట్ల సైదులు,కోట్ల శ్రీనివాసరెడ్డి,గోవిందరెడ్డి,బాబు నాయక్,పొదిల శ్రీను, కన్నెకంటి రామకృష్ణ, నాగేశ్వరావు, మంగ, ద్రోణాచారి, పర్వతం లింగయ్య,శాఖ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.