మిర్యాలగూడ:  బిజెపిని తెలంగాణ నుంచి తన్ని తరిమేస్తారు – గుత్తా

మిర్యాలగూడ:  బిజెపిని తెలంగాణ నుంచి తన్ని తరిమేస్తారు – గుత్తా
మిర్యాలగూడ , మన సాక్షి :

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి బిజెపిని తన్ని తరిమేస్తారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన ప్రధాని మోడీ ప్రసంగంపై విరుచుకుపడిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి .

 

శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు .

 

ALSO READ : 

1. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

2. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

3. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

 

ఈ సందర్బంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేవలం ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు.

 

తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెబితే బాగుండేదన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో అడుగడుగునా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీని తెలంగాణ నుంచి ప్రజలు తన్ని తరిమేస్తారని తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని అన్యాయాలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలల్లో దేశంలోనే మొదటి, రెండవ, మూడోవ స్థానాల్లో ఉంది అని తెలిపారు.