కోదాడ : చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
కోదాడ, మనసాక్షి :
మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత హస్తకళా,వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళా సంస్కృతి చేనేత వస్త్ర ప్రదర్శన హస్తకళ మేళాను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత హస్త కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆ కలను అంతరించిపోకుండా చేనేతకు చేయూతను అందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం నిర్వాహకులు లక్ష్మణ్, కార్తీక్ లు మాట్లాడుతూ..
నేటి నుండి ఈ నెల 17వ తారీకు వరకు అమ్మకము మరియు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కోట మధు, షేక్ మదర్, ఖాజా మోహిను ద్దీన్, శ్రావణ్,డాక్టర్ బ్రహ్మం, గంధం పాండు తదితరులు పాల్గొన్నారు.









