సూర్యాపేట : కలిసిన కాంగ్రెస్ నేతల చేతులు

నిన్నటి వరకు ఎడమొహం, పెడ మొహం గా ఉన్న సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు నేడు కలిసాయి

సూర్యాపేట : కలిసిన కాంగ్రెస్ నేతల చేతులు

గెలుపు మాదే అంటూ సంబర పడుతున్న కార్యకర్తలు

సూర్యాపేట, మనసాక్షి :

నిన్నటి వరకు ఎడమొహం, పెడ మొహం గా ఉన్న సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు నేడు కలిసాయి. బుధవారం సూర్యాపేట రూరల్ మండలం రామచంద్ర పురం గ్రామంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిలు ఒకటయ్యారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇరువురు పోటిపడి ఎవరికీ వారు ప్రయత్నం చేశారు. దింతో అధిష్టానంనకు తలనొప్పిగా మారింది. అయితే అధిష్టానం రామిరెడ్డి దామోదర్ రెడ్డి కి టికెట్ కేటాయించడంతో అలుక బునినా పటేల్ రమేష్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి గా బరిలోకి నిలిచి సింహం గుర్తు పైన పోటీ చేసేందుకు ప్రచారం కూడా నిర్వహించారు.

ALSO READ : మిర్యాలగూడ : సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక..!

అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి ప్రతినిధి బృందం ను సూర్యాపేటకు పంపి పటేల్ రమేష్ రెడ్డితో చర్చలు జరిపి నల్గొండ పార్లమెంట్ స్థానం ఇచ్చేందుకు కె సి వేణుగోపాల్ టికెట్ అంగీకరించడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నామినేష ఉపసంహరణ జరిగి,ఎన్నికల ప్రచారం ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఇరువురు నేతలు కలిసి ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కు సంతోషాన్ని కలిగించింది.

ఇరువురు నేతలు కలిసి ప్రచారం నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రమేష్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించి దామోదర్ రెడ్డి గెలుపు కృషి చేసినట్లయితేవచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు సునాయసంగా ఉంటుందని పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు.

ALSO READ : BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి