Breaking Newsతెలంగాణరాజకీయం
Harish Rao : చర్చకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారు.. మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు..!
విద్యాశాఖలో అవినీతిపై చర్చించేందుకు చర్చకు రమ్మని చెప్పిన మంత్రులు.. వెళ్తుంటే ఎందుకు పోలీసులతో అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

Harish Rao : చర్చకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారు.. మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు..!
మన సాక్షి, హైదరాబాద్ :
విద్యాశాఖలో అవినీతిపై చర్చించేందుకు చర్చకు రమ్మని చెప్పిన మంత్రులు.. వెళ్తుంటే ఎందుకు పోలీసులతో అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గన్ పార్క్ లో చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ మాత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్, అజహారుద్దీన్ ఉన్నారు. హరీష్ రావును చర్చకు రావాలని సవాల్ విసిరడంతో హరీష్ రావు కూడా చర్చకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. కాగా అక్కడికి వెళ్లకుండా హరీష్ రావును పోలీస్ వార్డుకున్నారు. దాంతో హరీష్ రావు ముగ్గురు మంత్రులకు కూడా ఫోన్లు చేశారు. ఎవరు స్పందించకపోవడంతో తమను చర్చకు రమ్మని చెప్పి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచిందని ఆయన వ్యాఖ్యానించారు.









