Nalgonda : భారీగా బెల్లం, అలం పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు..!
Nalgonda : భారీగా బెల్లం, అలం పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు..!
నల్లగొండ, అక్టోబర్ 30 ,మన సాక్షి.
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం జోడుబాయ్ తండాలో నాటుసారా తయారీకి నల్లబెల్లం సరపరా అవుతుందనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ టీమ్ బుధవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో బెల్లంతోపాటు అలం, రెండు ఆటోలను, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ టి ఎఫ్ టీమ్ ఎస్సై బాలరాజ్ టీమ్ దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి వినియోగించే 450 కిలోల నల్ల బెల్లం, 50 కేజీల అలం, 10 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు.
జోడుబాయ్ తండాలలోకి తీసుక వెలు తుండగగా బెల్లాని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి జోడు భాయ్ తండాకు కారులో వచ్చిన బెల్లాన్ని ఆటోల్లోకి తరలిస్తున్న క్రమంలో ఎక్సైజ్ పట్టుకుంది. రూ.50 వేల విలువ చేసే బెల్లం, అలంతో పాటు రూ.4 లక్షల విలువ చేసే రెండు ఆటోలను, రూ. ఐదు లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుల్లో కేశవత్ శ్రీను, కుమారులను అరెస్టు చేశారు. బెల్లం, అలంను పట్టుకున్న టీమ్‌లో ఎస్ టి ఎఫ్ ఎస్సై బాలరాజుతోపాటు హెడ్ కానిస్టేబుల్ విజయ కృష్ణ , కానిసేబుళ్లు యాదాగిరి, కౌశిక్‌లు పాల్గన్నారు.
బెల్లాన్ని పట్టుకున్న ఎస్ టి ఎఫ్ టీం ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్టీఎప్ టీం లీడర్ ప్రదీప్‌రావులు అభినందించారు.
MOST READ :
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Miryalaguda : దీపావళి మంగళహారతులు ఏరోజు.. పండుగ జరుపుకునేది ఎప్పుడు..!
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!









