Holidays : తెలంగాణలో రెండు రోజులు సెలవులు..!

Holidays : తెలంగాణలో రెండు రోజులు సెలవులు..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వర్షాల కారణంగా ఇళ్లలో నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు లేవు.

 

దాంతో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. విద్యాశాఖ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. గురు, శుక్రవారాలలో సెలవులను ప్రకటించింది.

 

అదే విధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. ఆన్ లైన్ లో తరగతులు జరుపుతున్నాయి.

 

ALSO READ : 

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!