Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!
Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి పరార్ అయ్యాడు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ హెచ్ ఓ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవరకొండ పట్టణంలో బిఎన్ఆర్ కాలనీలో గత ఐదు సంవత్సరాలు గా మాదన్న కృష్ణ అలియాస్ వేణుగోపాల్ రెడ్డి అని ఒక వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు. తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగినని నమ్మిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు.
యం.స్వాతి, షేక్ తబ్రీజ్లను నమ్మించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని వారి వద్ద నుండి 26 లక్షల రూపాయలు తీసుకొని దేవరకొండ నుండి ఎటువంటి ఉద్యోగాలు ఇప్పియకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. బాధితులు స్వాతి, తబ్రీజ్ల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Kamareddy : నడిరోడ్డు పై భార్యను హత్య చేసిన భర్త..!
-
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
-
Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!









