Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలు

Kamareddy : నడిరోడ్డు పై భార్యను హత్య చేసిన భర్త..!

Kamareddy : నడిరోడ్డు పై భార్యను హత్య చేసిన భర్త..!

కామారెడ్డి, మన సాక్షి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నడిరోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో, శనివారం చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి పట్టణంలోని ఆర్.బి నగర్కు చెందిన నర్సింలు, మహేశ్వరి భార్యాభర్తలు చౌరస్తాలో గల సులబ్ కాంప్లెక్స్ లో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి, వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. డబ్బులు విషయమై నరసింహులు శనివారం చౌరస్తా వద్ద, మహేశ్వరితో గొడవపడ్డాడు.

అనంతరం వెంట తెచ్చుకున్న చాకుతో భార్య గొంతు కోశాడు. ఆపై తాను కడుపులో పొడుచుకుని, ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే నర్సింలును, స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు.

ఏ ఎస్పీ చైతన్య రెడ్డి , సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లుగా, ప్రాథమిక విచారణలో తెలిసిందని సీఐ , పోలీసులు తెలిపారు.

MOST READ :

  1. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

  2. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు