TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!

TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుండగా కొనుగోలు కేంద్రాలలో సందడి నెలకొన్నది. పౌరసరఫరాల సంస్థ నిర్దేశించిన లక్ష్యమేరకు రాష్ట్రవ్యాప్తంగా 8465 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా వాటిలో 8361 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం నిన్నటి వరకు మొత్తం 41.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో 22.86 లక్షల టన్నుల దొడ్డు రకం దాన్యం కాగా 18.6 లక్షల టన్నుల సన్న రకం దాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. సన్న రకం ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా అందిస్తుంది.
ALSO READ : Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకున్న రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి 6668.63 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కొనుగోలు చేసిన ధాన్యంలో 35.39 లక్షల టన్నుల దాన్యంలో రైస్ మిల్లులకు కూడా తరలించారు. నవంబర్ లో కొనుగోలు చేసిన దాన్యంలో ఇంకా 54,251 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాల్సి ఉంది.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది. ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు చోటుచేకోకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేసింది. జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ లు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు చేపట్టారు.
MOST READ :
-
TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!
-
Nalgonda : సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా కిడ్నాప్..!
-
Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!
-
IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!









