PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!

PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. శనివారం వారణాసిలో 20వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. అందుకు గాను 20వేల కోట్ల రూపాయల నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పర్యటించిన ఆయన 2 వేల 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమానికి వర్చువల్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిధుల కేటాయింపు కార్యక్రమానికి హాజరు కాగా ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా హాజరయ్యారు.
MOST READ :
-
Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!
-
Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
-
Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!









