వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉన్నారా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..!

ఓటరు జాబితాలో ఇక పై తప్పులకు ఎలాంటి ఆస్కారం ఉండరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు సహాయ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు

వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉన్నారా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఓటరు జాబితాలో ఇక పై తప్పులకు ఎలాంటి ఆస్కారం ఉండరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు సహాయ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహాయ కేంద్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అక్కడి బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లను మరణ ధ్రువపత్రo ఆధారంగా తొలగించాలని అక్కడి సిబ్బంది కి సూచించారు. జాబితాలో ఓటర్ల ఫోటోలు సరిగ్గా లేకపోతే వాళ్ళ కొత్త ఫోటోలు తెప్పించుకుని సరి చేయాలన్నారు. వంద సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

తొలగించిన డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి జాబితా ను తయారు చేసి ఉంచుకోవాలని బిఎల్ఓ లకు సూచించారు. ఇకపై ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు గానీ, చనిపోయిన వారి ఓట్లు గానీ, ఏ చిన్న పొరపాటు ఉండటానికి వీలు లేదని స్పష్టం చేశారు. అనంతరం ఆయన పట్టణoలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో గల ఓటరు సహాయ కేంద్రాన్ని పరిశీలించారు.

అక్కడి ఓటరు జాబితాలో ఫోటోలు సరిగ్గా లేని ఓటర్ల ను గుర్తించిన ఆయన వెంటనే కొత్త ఫోటోలు తెప్పించుకుని సరి చేయాలని బిఎల్ఓ లను ఆదేశించారు. సమయం తక్కువగా ఉందని, తొందరగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ ను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రామచందర్, స్థానిక తహసిల్దారు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కెసిఆర్ ఎన్నడూ దావోస్..గీవోస్ గురించి పట్టించుకోలేదు, మరి రేవంత్ వెళ్తే జోకులు ఎందుకో చూడండి..!