కెసిఆర్ ఎన్నడూ దావోస్..గీవోస్ గురించి పట్టించుకోలేదు, మరి రేవంత్ వెళ్తే జోకులు ఎందుకో చూడండి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై జోకులు పేలుతున్నాయి. ఇప్పటికే ఆయన ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంపు మేస్త్రి ని అని చెప్పడం.. దానిని ప్రతిపక్షాలు ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

కెసిఆర్ ఎన్నడూ దావోస్..గీవోస్ గురించి పట్టించుకోలేదు, మరి రేవంత్ వెళ్తే జోకులు ఎందుకో చూడండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై జోకులు పేలుతున్నాయి. ఇప్పటికే ఆయన ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంపు మేస్త్రి ని అని చెప్పడం.. దానిని ప్రతిపక్షాలు ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మరీ కొత్తగా దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలను జోకులు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే వాస్తవానికి ఓ ముఖ్యమంత్రి కి ఇంగ్లీషు రావడం అంత ముఖ్యమా..? అసలే మన రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిని అని చెప్పటం.. అసలు గుంపు మేస్త్రికి ఇంగ్లీష్ రావడం అవసరం లేదు. కేవలం అర్థం చేసుకునే కమ్యూనికేషన్ ఉంటే చాలు.

అసలు వాస్తవం చెప్పాలంటే మోడీకి పెద్దగా ఇంగ్లీష్ వస్తుందా..? ఏపీ ముఖ్యమంత్రి జగన్, పదేళ్లపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఈ దావోస్.. గీవోస్ గురించి పట్టించుకోనే లేదు.

అలాంటిది ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఇతర దేశాల నుంచి పెట్టుబడుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే దానిని అభినందించాల్సిన వారు ట్రోల్స్ చేయటం గమనార్హం. అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన పాత్ర పర్సంటేజ్ లేదు.

ALSO READ : మిర్యాలగూడ : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ..!

ఆదాని ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఎన్నో ప్రాజెక్టులకు కేసీఆర్ హయాంలోనే ఒప్పందాలు అయ్యాయి. దావోస్ లో రేవంత్ రెడ్డి మన తెలంగాణ గురించి వివరించి… పెట్టుబడులు ఆహ్వానిస్తే వస్తాయా..? అక్కడ మన తెలంగాణ గురించి కొత్త కంపెనీలు రావడానికి మన ప్రజెంటేషన్ ముఖ్యమవుతుందా..? అలా అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి ప్రజెంటేషన్ ఇస్తే మన తెలంగాణకు కొత్త కొత్త కంపెనీలు వచ్చేవి కదా..!

మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఆయన వెళ్లి ప్రజెంటేషన్ చేస్తే ఎక్కువ కొత్త కంపెనీలు వచ్చేవి కదా..? మనం వెళ్లి .. మన గురించి, మన తెలంగాణ గురించి గొప్పలు చెబితే కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకోవు.

ALSO READ : యాదాద్రి పవర్ ప్లాంట్, అధికారులపై.. విజిలెన్స్ దాడులు..?

కంపెనీకి కావలసిన కనెక్టివిటీ, సేఫ్టీ, గవర్నమెంట్ సేఫ్టీ, మ్యాన్ పవర్, శాలరీస్ అన్ని సరిపడా చూసుకున్నాకనే కొత్త కంపెనీ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటారు. అయినా ఇప్పుడే ఏర్పడిన ప్రభుత్వం నెలరోజులకే విదేశాలలో పెట్టుబడుల కోసం వెళ్లడం అవసరమా..? ఇక్కడ ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి ..? ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీ పరిస్థితి ఏంటి..? ఇంకా ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి..? అనే విషయం మరిచి దావోస్ పర్యటన అంత హడావిడిగా చేయాల్సిన అవసరమా..? అంటూ నేటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

అది కూడా వాస్తవమే అని చెప్పవచ్చును. మరి ఇక్కడ చేయాల్సిన అంత పని ఉంటే దావూస్ పర్యటనకు ఎందుకు వెళ్లినట్లు. దావోస్ పర్యటనలో కొత్త కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చినా.. ఇప్పుడిప్పుడే కంపెనీల నిర్మాణం కాదు కదా.. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోసం వెతుకులాట ప్రారంభమైందని చెప్పవచ్చును.

ALSO READ : Mahalakshmi : మహాలక్ష్మి పథకంలో రూ. 2500లకు అందరూ అర్హులు కాదా.. అర్హతలు ఇవేనా..!