మిర్యాలగూడ : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బలం లేకుండానే అవిశ్వాసానికి పూనుకున్న అధికార పార్టీ.. అవిశ్వాసం వీగిపోవడంతో ఎదురు దెబ్బ తగిలింది.

మిర్యాలగూడ : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ..!

మిర్యాలగూడ ,మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బలం లేకుండానే అవిశ్వాసానికి పూనుకున్న అధికార పార్టీ.. అవిశ్వాసం వీగిపోవడంతో ఎదురు దెబ్బ తగిలింది. దాంతో ఒకసారిగా షాక్ గురయ్యారు. వివరాల ప్రకారం…

మిర్యాలగూడ నియోజకవర్గంలోని తడకమళ్ళ పిఎసిఎస్ చైర్మన్ సంజీవరెడ్డి ,వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు పై అవిశ్వాసం పెట్టాలని అధికారులకు డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం డి సి ఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు అవిశ్వాసం నిర్వహించారు. కాగా అవిశ్వాసానికి ఓటు వేయడానికి డైరెక్టర్లు రాకపోవడంతో వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకు షాక్ తగిలింది. దాంతో యధావిధిగా పిఎస్సిఎస్ చైర్మన్ గా సంజీవరెడ్డి , వైస్ చైర్మన్ గా వెంకటేశ్వర్లు కొనసాగనున్నట్లు డిసిఒ కిరణ్ కుమార్ వెల్లడించారు.

ALSO READ : Mahalakshmi : మహాలక్ష్మి పథకంలో రూ. 2500లకు అందరూ అర్హులు కాదా.. అర్హతలు ఇవేనా..!

అవిశ్వాసం నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నం :

తడక మల్ల పిఎసిఎస్ కు 13 మంది డైరెక్టర్లు ఉండగా వారిలో అవిశ్వాసం పెట్టాలని మెజారిటీగా డైరెక్టర్లు అధికారులకు విన్నవించారు. కానీ అవిశ్వాసం పెట్టాలని వినతిపత్రం అందజేసిన డైరెక్టర్లలోనే ఇద్దరు డైరెక్టర్లు (ఒకరు కాంగ్రెస్ , మరొకరు సిపిఎం) టిఆర్ఎస్ కు మద్దతు తెలియజేయడంతో అవిశ్వాసం వేగిపోయింది.

పిఎసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తడకమళ్ళ గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ : Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!