Hunters : వేటగాళ్లే ఉచ్చులో పడ్డారు

Hunters : వేటగాళ్లే ఉచ్చులో పడ్డారు

ఏటూరునాగారం, మన సాక్షి

అడవిలో అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు అధికారుల ఉచ్చులో పడ్డారు. ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం, ఎస్సీ కాలనీలో దుప్పి మాంసాన్ని, విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు, పట్టుకున్నారు .

 

ఏటూరునాగారంలో అడవి జంతువులు మాంసం విక్రయిస్తున్నారనే, పక్క సమాచారంతో డిఆర్ఓ, నరేందర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి, చేరుకుని మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు .

 

వారినుంచి, దుప్పి తల. కాళ్ళు మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అడవి శాఖ అధికారులు, తెలిపారు ఇందుకు సంబంధించిన, పూర్తి వివరాలు తెలియాల్సి, ఉంది