హైదరాబాద్ – సాగర్ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య
హైదరాబాద్ – సాగర్ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని మూడు జిల్లాల కూడాలి మాల్ వెంకటేశ్వర నగర్. హైదరాబాద్ – నాగార్జున సాగర్ రహదారి ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి మంగళవారం సంత నిర్వహించడం జరుగుతుంది.
హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వాహనాలు ఈ రాష్ట్ర రహదారి నుండి మల్లేపల్లి , దేవరకొండ, పెద్దవూర, సాగర్, మాచర్ల , హాలియా, మిర్యాలగూడెం తదితర గ్రామాలకు వేలాది వాహనాలు ఈ ప్రాంతం నుండి బయలుదేరి వెళుతుంటాయి.
రహదారిపై పోకిరీలు మద్యం, గంజాయి, పాన్ పరాక్ లాంటి మత్తు పానీయాలు తీసుకుంటూ నడిరోడ్లపై అరాచకాలు సృష్టిస్తూ వికృత శ్రేష్టలకు పాల్పడుతున్నారు. హైదరాబాదుకు కూత వేటు దూరంలో రాచకొండ కమిషనరేట్ పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రతినిత్యం రహదారిపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
సంబంధిత పోలీస్ అధికారులు చొరవ తీసుకొని రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు చట్టరీత్యా రోడ్లపై పోకిరీలు అజాగ్రత్తగా వాహనాలు నడిపే వారిపట్ల చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు పోలీస్ అధికారులను కోరుతున్నారు.









