Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Sky walk : హైదరాబాదులో ఆకాశమార్గం, ప్రారంభానికి సిద్ధం

Sky walk : హైదరాబాదులో ఆకాశమార్గం, ప్రారంభానికి సిద్ధం

హైదరాబాద్ , మనసాక్షి :

రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఆకాశమార్గంలో రోడ్డు నిర్మించారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆకాశమార్గం (స్కై వే) ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టింది. ఈ నిర్మాణానికి సుమారుగా 1000 టన్నులకు పైగా స్టీల్ ఉపయోగించి అధునాతనంగా ఈ స్కై వే నిర్మించారు.

ఆరు ఎంట్రీలు :

స్కై వేకి 6 ఎంట్రీలు, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతపూర్ రోడ్డు, జిహెచ్ఎంసి పార్కు, జిహెచ్ఎంసి ఆఫీస్ సమీపంలో, వరంగల్ బస్ స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ స్టేషన్ ఎదురుగా ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని : 

భవిష్యత్తులో ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్కై వాక్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అత్యంత రద్దీగా ఉండటం వల్ల రోడ్డు మార్గం ద్వారా రోడ్డు క్రాస్ చేయటం నడుచుకుంటూ వెళ్లే వారికి చాలా కష్టంగా ఉంటుంది. దాంతో స్కై వే ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది.

ఆధునిక టెక్నాలజీ

ఉప్పల్ రింగ్ రోడ్డు లోని స్కై వే ఆధునిక టెక్నాలజీతో నిర్మించారు . స్కై వే పొడవు 640 మీటర్లు వెడల్పు వర్టికల్ 3,4,6 ఉంచారు. లిఫ్ట్, ఎస్కలేటర్స్, మెట్ల సౌకర్యంతో దీనిని నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో మరో కొద్ది రోజుల్లో దీనిని ప్రారంబించబోతున్నారు.

మరిన్ని వార్తలు