Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

హైదరాబాద్ : బయటపడ్డ మరో సొరంగం, కనిపించిన 12 అడుగుల పాము

హైదరాబాద్ : బయటపడ్డ మరో సొరంగం, కనిపించిన 12 అడుగుల పాము

హైదరాబాద్, మనసాక్షి :

హైదరాబాద్ లో మరో చారిత్రాత్మకమైన సొరంగం బయటపడింది. రాజేంద్రనగర్లోని ముష్క్ మహల్ లో ఈ సొరంగం కనిపించింది. సొరంగ మార్గం కనిపించడం చర్చనీ అంశంగా మారింది. కులీకుతుబ్ షా నవాబులలో ఆఖరివాడైన అబుల్ హాసన్ తనషా 16 81వ సంవత్సరంలో ఈ ముష్క్ మహల్ నిర్మించాడు.

ఈ మహల్ లో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం చాలా రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. కాగా కొంతమంది యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలకు ఈ మహల్ లోకి వెళ్లినట్లు సమాచారం. కాగా ఆ సమయంలో సొరంగంలో ఓ పెద్ద బండరాయితోపాటు పాము పైనుంచి పడడంతో ఆ యువకులు పారిపోయినట్లు తెలిసింది.

 

అతి పెద్ద 12 అడుగుల పామును చూసి యువకులు పరారు కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పురావస్తు శాఖ అధికారులను పోలీసు వారు అలర్ట్ చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు