నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు ఉంటే చర్యలు..!
నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు ఉంటే చర్యలు..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రైట్ ప్రైవేట్ హాస్పిటల్ ను జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ టైం లో సమర్పించిన డాక్యుమెంటేషన్ మరియు అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్, సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని పరిశీలించారు.
ఎవరైనా అనుమతించిన విధంగా పరిమితులకు లోబడి సేవలు అందించాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో రిజిస్ట్రేషన్ టైం లో ఇచ్చిన సిబ్బందిని మార్చి కొత్తవారు వచ్చినప్పటికీ తమకు తెలియపరచకుండా వారితో సేవలు అందిస్తున్నారని అది చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఈ తనిఖీలలో ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వెంట అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)
-
Nalgonda : పది నెలలుగా పస్తులు.. దీపావళి పండుగకు అయినా అందేనా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఈ సీజన్ కు లేనట్టేనా..?
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)









