BREAKING: నల్గొండలో నగదును రెట్టింపు చేస్తామని కొత్త రకం మోసం.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..!

నల్గొండలో నగదు డబుల్ చేస్తామని సరికొత్త మోసానికి మోసగాళ్లు తెరలేపారు. బీహార్ రాష్ట్రానికి చెందినవారు నల్లగొండలో మోసానికి పాల్పడగా 24 గంటలు గడవక ముందే నల్గొండ పోలీసులు అతి చాకచక్యంగా కేసు చేదించి వారిని అరెస్టు చేశారు. సంఘటన నాలు ఇలా ఉన్నాయి..

BREAKING: నల్గొండలో నగదును రెట్టింపు చేస్తామని కొత్త రకం మోసం.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..!

జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండలో నగదు డబుల్ చేస్తామని సరికొత్త మోసానికి మోసగాళ్లు తెరలేపారు. బీహార్ రాష్ట్రానికి చెందినవారు నల్లగొండలో మోసానికి పాల్పడగా 24 గంటలు గడవక ముందే నల్గొండ పోలీసులు అతి చాకచక్యంగా కేసు చేదించి వారిని అరెస్టు చేశారు. సంఘటన నాలు ఇలా ఉన్నాయి..

నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఒరిజినల్ 500 రూపాయల కరెన్సీ నోట్లను పైన ఒకటి, కింద ఒకటి పెట్టి మద్యలో తెల్ల కాగితాలను పెట్టి, బాదితులను మోసం చేసి అక్కడి నుండి అసలు కరెన్సీ తో పారి పారిపోయిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పి శరత్ చంద్ర పవర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

ఈ నెల 22న నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఆర్‌ఎం‌పి డాక్టర్ శ్రీరామోజు రామాచారి వద్ద నుండి 33 లక్షల రూపాయలను నగదును రెట్టింపు చేస్తాం అని చెప్పి, మోసం చేసి అసలు నగదుతో పారిపోయారు.

జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణ లో నల్గొండ-II టౌన్ సర్కిల్ సీఐ డానియెల్ కుమార్ ఆధ్వర్యం లో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శివ కుమార్ కానిస్టేబుల్ తిరుమలేష్, కానిస్టేబుల్ లు జానకి రాములు.. నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ధ నుండి రూ.24 లక్షల రూపాయలు స్వాధీనము చేసుకున్నారు. మూడవ వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నేరస్థులు :

బిహార్ రాష్ట్రంకు చెందిన షేక్ శిరాజ్, రాం నరేష్ యాదవ్, లను అరెస్ట్ చేయగా షేక్ అఫ్తాబ్ పరారీలో ఉన్నాడు.

వీరి వద్ద నుండి 24 లక్షల నగదు, 3 సెల్ ఫోన్ లు, నోట్లను తయారుచేస్తానని మోసం చేయుటకు ఉపయోగించిన రంగు, కలర్ సీసాలు, ఇతర సామగ్రి, తెల్లని కాగితాలు కలిగిన నోట్ల కట్ట లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

విలేకరులకు వివరిస్తున్న జిల్లా ఎస్పీ

నేరం ఎలా ఇలా చేశారంటీ ..?

బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేష్ యాదవ్ గతంలో నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రి గా పని చేసినాడు. ఆ సమయంలో చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అయిన శ్రీ రామోజు రామాచారి ఇల్లును కట్టడం జరిగింది.

ఈ నెల 22 న ఉదయం 11 గంటల సమయంలో సదరు రామ్ నరేష్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి చందనపల్లి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీరామోజు రామాచారి ఇంటికి వెళ్లారు. వారి దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉన్నదని మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నచో వాటిని రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపించి నమ్మించారు.

వారి మాటలను నమ్మిన శ్రీ రామోజు రామాచారి అతని బావమరిది బై రోజు అమరేంద్ర చారి లు ఇద్దరూ రామాచారి వాళ్ళ ఇంట్లో మొదటి ఫ్లోర్ కి తీసుకెళ్లి, రామాచారి భూమిని కొనుగోలు చేయడానికి తెచ్చిన 33 లక్షల రూపాయల నగదును వారికి చూపించారు. వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్ ని ఒక బకెట్లో పోసి 50 వేల రూపాయల కట్టలను ఆరింటిని అనగా మూడు లక్షల రూపాయలను ఒకసారి లిక్విడ్ లో ముంచి బయటకు తీసి, వాటికి వారి వద్ద ఉన్న తెలుపు మరియు బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు వేసి ఒక బండల్ గా చేసినారు.

అలా మరొక మూడు లక్షల రూపాయలను లిక్విడ్ లో ముంచి వాటికి కూడా ప్లాస్టర్లు వేసి బండెలుగా చేసినారు. అనంతరం అలా మూడు లక్షల రూపాయల ఒక కట్ట చొప్పున మొత్తం 33 లక్షల రూపాయలను11 కట్టలు కట్టి, అట్టి కట్టలలో మూడు కట్టలను ఒక పెద్ద బండెలుగా తయారుచేసి, అలా 3 బండెలు లు చేసి వారు తెచ్చిన లిక్విడ్ లో ముంచినారు.

ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే అట్టి డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి వాటికి హైదరాబాద్ కు వెళ్లి లేబుల్స్ కొనుక్కొస్తామని చెప్పినారు. అంతలో రామాచారి బావమరిది అమరేంద్ర చారి తన ఇంటికి వెళ్ళగా, పేషెంట్ వచ్చినాడని రామాచారి మొదటి ఫ్లోర్ నుండి కిందికి దిగినాడు.

ఆ సమయంలో నేరస్తులు ఇద్దరు అప్పటికే వారి వెంట బ్యాగులో ఒక కట్టకి పైన ఒకటి కింద ఒకటి ఒరిజినల్ 500 రూపాయల నోట్లు పెట్టి మధ్యలో తెల్లటి కాగితాలను పెట్టి ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను నిజమైన కట్టల స్థానంలో ఉంచి వాటిని నేరస్తుల బ్యాగుల లో పెట్టుకొని హైదరాబాద్ కు వెళ్లి లేబుల్స్ తీసుకుని ఉదయం వస్తామని చెప్పి వెళ్ళిపోయినారని ఎస్పీ తెలిపారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సామాగ్రి

ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని నల్గొండ ఎస్‌పి ఉత్తర్వుల మేరకు, నల్గొండ రూరల్ ఎస్‌ఐ శివ కుమార్, కానిస్టేబుల్స్ తిరుమలేష్, జానకి రాములు మరియు హోం గార్డ్ సలీం లు టీమ్ గా ఏర్పడి నేరస్తుల ఆచూకీ గురుంచి వెతుకుతుండగా, నల్గొండ రైల్వే స్టేషన్ లో బిహార్ పారిపోవుటకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి, వారి వద్ద ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా, డబ్బుల కట్టలు కనిపించినవి. వెంటనే వారి ఇద్దరిని అదుపులోకి తీసుకొని, విచారించి వారి వద్ద ఉన్న 24 లక్షల నగదు స్వాధీనం చేసుకోనైనది.

ఇట్టి కేసులో ఉన్న మూడవ వ్యక్తి అయిన షేక్ ఆఫ్తాబ్ 9 లక్షల నగదుతో పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతనిని పట్టుబడి చేస్తామని తెలిపారు. ఇట్టి కేసును నల్గొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నల్గొండ టు టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ డానియల్ కుమార్ ఆద్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్‌ఐ శివ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్, జానకి రాములు, హోం గార్డ్ సలీం చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులని పట్టుబడి చేసినారని, నల్గొండ ఎస్‌పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ అభినందించినారు.

ALSO READ : 

Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!