Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఐదుగురు రిమాండ్..!

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినపుర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మొత్తం 7 మంది నిందితు లను పోలీసులు రిమాండ్‌కు పంపినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఐదుగురు రిమాండ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినపుర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మొత్తం 7 మంది నిందితు లను పోలీసులు రిమాండ్‌కు పంపినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ 1గాచండేపల్లి స్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెదిరపాడు గ్రామానికి చెందిన ఇతను తన అధికారాన్ని దుర్వినియోగం చేసి బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరా లలో నమోదు కాగా అట్టి సీసీ కెమెరాలు ఏ 2 గుర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యా యుడు, ఏర్పాటుచేసి ఆ వీడియోను ఏ 3 కర్ని చెన్నకేశవులు, ప్రభుత్వ, ఉపాధ్యాయుడు దాచిపెట్టి ఇతర నిందితులు ఏ 4 గొల్ల రవికుమార్, ఏ 5 బి ఆనంద్, ఏ 6 విజయ్ కుమార్, ఏ 7 మేకల రవి, సాక్ష్యాలను దాచిపెట్టడం, వీడియోను అనధికారికంగా పంచుకోవ డం అదే గ్రామంలో డబ్బుల కు రాజీ ప్రయత్నాలు చేయ డం వంటి చర్యలకు పాల్పడి నట్లు తెలిపారు.

ఈ కేసు విచారణ డీఎస్పీ నల్లపు లింగయ్య చేపట్టగా అట్టి మైనర్ బాలిక పై ప్రధాన నిందితుడు పాలు మార్లు అత్యాచారానికి పాల్పడినాడని విచారణలో వెల్లడైం దన్నారు, అతనిపై, అతనికి సహకరించిన వ్యక్తులపై
పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మొత్తం 7 మందిని రిమాండ్‌కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

నారాయణపేట జిల్లాలో, విద్యాసంస్థల్లో విద్యార్థులు భద్రత అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా అత్యవసర సమయంలో డయల్ 100 కి లేదా 112,1098 కి తెలియ జేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

సమస్యలను చట్టపరంగాపరిష్కరించకుండా స్వయంగా రాజీ ప్రయ త్నాలు చేయడం లేదా నేరా లను దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర మైన నేరాలుగా పరిగణించి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు