Chinthapalli : కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన.. పూజలు చేసిన ఎమ్మెల్యే బాలునాయక్..!
Chinthapalli : కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన.. పూజలు చేసిన ఎమ్మెల్యే బాలునాయక్..!
చింతపల్లి, మనసాక్షి ;
మైసమ్మ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు అందరూ పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులో హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై నెలకొని శ్రీ వనం మైసమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గత మూడు రోజుల నుండి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గురువారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వేద మంత్రోత్సరణల నడుమ వేలాది మంది భక్తుల నడుమ యంత్ర ప్రతిష్ట తో ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కర్మాంఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయ గుడి చైర్మన్ నల్ల రఘుమారెడ్డి పీసీసీ సభ్యులు జాల నరసింహారెడ్డి, జాల తిరుమల్ రెడ్డి వారి దంపతులు హాజరై అమ్మవారిని దర్శించుకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని ఏ కోరిక కోరిన తప్పకుండా నెరవేరుతుందని వారు పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని పోలేపల్లి రాంనగర్ గ్రామం నుండి ప్రచారాన్ని మొదలుపెట్టామని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.
అమ్మవారు దీవెనలు పొంది ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాతలు సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతున్న అమ్మవారి దేవాలయం మునుముందు మరో మైసిగండి లాగా అభివృద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. అమ్మవారి దీవెనలు అందరికీ కలిగి సుఖ సంతోషాలతో ముందుకు వెళ్దాం అన్నారు.
ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్మాణం కోసం సహకరించిన దాతలకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయకుల నాగభూషణం, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి జటావత్ గారి నాయక్, అంగిరేకుల గోవర్ధన్, మాస భాస్కర్, గడ్డం పురుషోత్తం రెడ్డి, మాజీ జెడ్పిటిసి జంగిటి నరసింహ యాదవ్ దొంతం వెంకట నరసింహారెడ్డి,
ముచ్చర్ల యాదగిరి, వాయిస్ ఎంపీపీ యాచారం యాదగిరి గౌడ్, ఆర్ ఎన్ ప్రసాద్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, , దేవాలయ కమిటీ చైర్మన్ సిద్ధ గొని కృష్ణ గౌడ్, మునుకుంట్ల శేఖర్ గౌడ్, కొప్పుల జంగయ్య గౌడ్, దొంత గోని శేఖర్ గౌడ్ వీరితో పాటు పలు గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు భక్తులు వేద పండితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Headache: టీ, కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందా.. నిజమిదే..!
-
Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..!
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!









