Suryapet | అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

తుంగతుర్తి , మన సాక్షి

క్రీడలతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తామని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. వరల్డ్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన అండర్ 19 జాతీయ కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం జట్టు తరఫున మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి గ్రామాలకు చెందిన కొండగడుపుల చందు, భాష బోయిన ప్రవీణ్, గుగులోతు సంతోష్ లు ఆడి మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి ద్వితీయ బహుమతి రావడంలో భాగస్వాములయ్యారు.

 

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!

 

అలాగే ఈనెల 21 తేదీలో నేపాల్ దేశంలో జరిగే కబడ్డీ పోటీలకు జాతీయస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఎమ్మెల్యేను కలిసి జాతీయ స్థాయికి వెళ్లడానికి ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ALSO READ : 

Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

 

అంతర్జాతీయ స్థాయిలో తుంగతుర్తి మండలం నుండి క్రీడాకారులు ప్రతిభ కనపరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంపటి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేశబోయిన హరీష్ యాదవ్, బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు రచ్చ నవీన్, ఇరుగు మురళి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.