కరీంనగర్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..!

నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ లో బిజెపి పార్టీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అంబేద్కర్ చౌరస్తాలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.

కరీంనగర్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..!

6 గ్యారెంటీలు కాదు.. 6 నెలలకోసారి సీఎం మార్పు

పుట్టోబోయే బిడ్డపేరు మీద కూడా లక్షా 20 వేల అప్పు చేశారు.

 హుస్నాబాద్ బహిరంగసభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

సిద్దిపేట్, మనసాక్షి :

నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ లో బిజెపి పార్టీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అంబేద్కర్ చౌరస్తాలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.

ఈ సందర్బంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ అటు ఇటు గాని పార్టీలకు ఓట్లేస్తే ఎటుకాకుండా పోతారని కరీంనగర్ లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి హుస్నాబాద్ కు వచ్చి పోటీ చేస్తుండని అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అన్నారు. ఇంకొకరు ప్రతి ఒక్కరూ కాళ్లు మొక్కాలట మొక్కుదామా అని అడిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే మళ్లీ ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావు కవిత సంతోష్ రావులు తలో పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటకొస్తారని ప్రభుత్వం పడిపోతుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరూ సీఎంలే చివరకు పొన్నం ప్రభాకర్ కూడా సీఎం అంటాడేమో వీళ్ల కొట్లాటలో ప్రభుత్వం పడిపోతుందని మళ్లీ ఎన్నికలొస్తయన్నారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం రావాలంటే బీజేపీతోనే సాధ్యమని డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కెసిఆర్ బిఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కాంగ్రెస్ అభ్యర్థులకు పైసలిచ్చి గెలిపించుకునే పనిలో పడ్డరన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!

వాళ్లు గెలిస్తే బీఆర్ఎస్ లోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేయాలని కుట్ర చేస్తున్నడన్నారు. గౌరవెల్లి బాధితులపై లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చూస్తే వాళ్ల పక్షాన నిలిచిందెవరు. ఇటీవల హుస్నాబాద్ వచ్చి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని కేసీఆర్ ప్రకటించిండని ఈ పనులకు కేంద్రం ఎప్పుడో 578 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.

హుస్నాబాద్ లో సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పేదలకు రేషన్ బియ్యం ఇస్తోంది కేంద్రమేనని వీధి దీపాలు సహా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే అన్నారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ ఇంట్లో కూర్చోలేదని నిరుద్యోగులు కష్టపడి చదివి కోచింగ్ తీసుకున్న ఏళ్ల తరబడి ఉద్యోగాల్లేక అల్లాడుతుంటే వారి పక్షాన నిలిచి పోరాడినానని నన్ను లాఠీలతో కొట్టించినా జైలుకు పంపినా వెనుకాడలేదన్నారు.

కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేసిండని ఐదు లక్షల కోట్లకుపైగా అప్పు చేసి పుట్టబోయే బిడ్డపై కూడా లక్షా ఇరవై వేల అప్పు మోపిండన్నారు. పొరపాటున మళ్లీ సీఎం అయితే అప్పు డబుల్ చేస్తాడని మోయలేని భారం మోపుతాడన్నారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలను గెలిపించారని ఒక్కసారి బీజేపీ అభ్యర్ధికి అవకాశమివ్వండని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ఏడు మండలాల పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!