గుండె నొప్పితో జర్నలిస్ట్ కుమారుడి మృతి..!

గుండె నొప్పితో జర్నలిస్ట్ కుమారుడి మృతి..!

కంగ్టి, మన సాక్షి :

గుండె నొప్పితో 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రం లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తడ్కల్ గ్రామానికి చెందిన రుస్తుం జలీల్ అనే జర్నలిస్ట్ కుమారుడు ఖలీల్ (13) అనే విద్యార్థి తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 6 వ, తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

మంగళవారం రాత్రి హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి బీదర్ లోని ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో నే మృతి చెందినట్లు తెలిపారు.

13 సంవత్సరాల విద్యార్థి ఖలీల్ గుండెనొప్పితో మృతి చెందడంతో జర్నలిస్టు జలీల్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. తడ్కల్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!