మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

మనసాక్షి :

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్యకు పాల్పడింది. పంచాయతీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 

పది రోజులపాటు సమ్మెలో పాల్గొన్నదని, ప్రభుత్వ ఒత్తిడి మేరకు విధుల్లో చేరి.. ఐదు రోజులుగా పంచాయతీ కార్యాలయానికి వెళ్తుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉద్యోగం పోతుందని మనోవేదనతో ఇంటి కోసం తెచ్చిన అప్పు తీర్చలేనో ఏమో అని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు బంధువులు పేర్కొంటున్నారు.