మిర్యాలగూడ : పోడు పత్రాలు అందరికీ ఇవ్వకపోతే మరో పోరాటం

ఓట్లు, సీట్ల కోసం వెంపర్లడం, బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం

మిర్యాలగూడ : పోడు పత్రాలు అందరికీ ఇవ్వకపోతే మరో పోరాటం

ఓట్లు, సీట్ల కోసం వెంపర్లడం, బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం

విలేకరుల సమావేశంలో జూలకంటి

మిర్యాలగూడ టౌన్,  మన సాక్షి:

కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూముల పత్రాలు అర్హులైన వారందరికీ ఇవ్వాలని లేకపోతే మరో పోరాటము చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల ఎకరాల అటవీ భూములను 4.25 లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు ఇప్పుడు లక్షన్నర మందికి సుమారు 4.06 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేసిందికు సిద్ధమయ్యారని అది సరికాదన్నారు.

 

గిరిజనేతరులు సుమారు లక్షన్నర మంది ఉన్నారని, ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటు జీవిస్తున్నారని చెప్పారు. వారికి కూడా పోడు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మూడు పత్రాలు అందించి న్యాయం చేయాలన్నారు .ఉమ్మడి రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలను పంపిణీ చేశారని ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

 

చెప్పిన దానిలో 50 శాతం కూడా పోడుపత్రాలు అందించడం లేదని విమర్శించారు .సాగులో ఉన్న రైతులందరికీ రైతుబంధు రైతు బీమా వస్తుందని వారందరికీ పోడు హక్కుల పత్రాలు అందించి న్యాయం చేయాలన్నారు. నల్గొండ జిల్లాలో 2928 మందికి 5578 ఎకరాలు సూర్యాపేట జిల్లాలో 84 మందికి 84 ఎకరాలు, భువనగిరి యాదాద్రి జిల్లాలో 2005 మందికి 213 ఎకరాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకే విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓట్లు సీట్ల కోసం ఇతర పార్టీల కోసం వెంపర్లారడం చేయడం లేదని బిజెపి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు. బిఆర్ఎస్ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి వామపక్షాలు దూరం అవుతారని చెప్పారు.

 

ALSO READ : 

1. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

2. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

3. Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!

4. Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!

 

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కలిసి రావాలని కేసీఆర్ కోరడంతోనే మద్దతు ఇచ్చామని తమ సహకారంతోనే మునుగోడు ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. అలా సహకరించకపోతే బిజెపి గెలిచేదని అలా గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయేదని ప్రభుత్వం పడిపోయేదని చెప్పారు.

 

భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని కేసీఆర్ అనేక సభల్లో చెప్పారని దానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఈ రెండు జిల్లాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయని చెప్పారు.

 

బలమున్న నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని ఈ విషయాలను కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. మరి కొన్ని రోజులు వేచి చూస్తామని బలమైన ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తామన్నారు కెసిఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అప్పుడే వంద సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని చెప్పారు.

 

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి,రేమిడాల పరుశురాములు, భావాండ్ల పాండు, పిల్లుట్ల సైదులు, మల్లయ్య, రామారావు, సోమయ్య జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు