లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
తెలంగాణలో జరిగిన లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న లీకేజీలపై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం లేదన్నారు. సిటింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బండి సంజయ్ పేపర్ లీక్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
అది వాస్తవమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీలు చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చేలగాట ఆడడం సరైంది కాదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తుందని కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పది పదిహేను రోజుల నుండి కేంద్రాల వద్ద ధాన్యం రాశులతో రైతులను కాలం వెళ్లదీస్తున్నారని.. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఐకెపి కేంద్రాలను ప్రారంభించాలన్నారు.
దేశంలో మోడీ ప్రభుత్వం ఒకే పార్టీ ఒకే మతం ఒకే దేశంగా ఉండాలని మత విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యల పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కింద రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు.
దేశంలో ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డా. మల్లు గౌతమ్ రెడ్డి నూకుల జగదీశ్ చంద్ర, రాగిరెడ్డి మంగా రెడ్డి, రేముదాల పరుశురాములు,
పోలేబోయిన వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, సత్యనారాయణ రావు, పాదురి శశిధర్ రెడ్డి, రొంది శ్రీనివాస్, పాపా నాయక్, పిల్లుట్ల సైదులు, కందూకురి రమేష్, దయానంద, వాడపల్లి రమేష్, మాధవ రెడ్డి, సైదులు,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.