జ్యూస్ అనుకుని.. పురుగుల మందు తాగిన చిన్నారి

జ్యూస్ అనుకుని.. పురుగుల మందు తాగిన చిన్నారి

రాయలసీమ, మన సాక్షి

ఓ బాలుడు జ్యూస్ అనుకుని పురుగుల మందు తాగేసిన సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో బుధవారం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని ఎగువబోయపల్లికి చెందిన కిరణ్ పెద్ద కుమారుడు చాణక్య(2) ఇంటిలో ఆడుకుంటూ జ్యూస్ అనుకుని పొరపాటున పురుగుల మందు తాగాడు.

 

ALSO READ : Whatsapp Tricks : వాట్సాప్ ట్రిక్స్.. వాడే వాళ్లంతా తెలుసుకోవాల్సిందే..!

 

గమనించిన కుటుంబీకులు బాలున్ని బైకుపై మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగం వైద్యులు మెరుగయిన చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు