Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Kanagal : కమనీయం.. శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం..!

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లా కనగల్ద మండలం దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం అమ్మవారి తిరు కళ్యాణం కన్నుల పండుగ జరిగింది.

Kanagal : కమనీయం.. శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం..!

కనగల్, మన సాక్షి:

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లా కనగల్ద మండలం దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం అమ్మవారి తిరు కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలలో వేద ఘోష మారుమ్రోగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రాకార మండపం నుంచి ఊరేగింపుగా డప్పు చప్పులతో పూనకాలు ఊగుతూ కళ్యాణ మండపానికి భక్తిశ్రద్ధలతో తరలించారు.

కళ్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలకు పేద పండితులు కళ్యాణ ఘట్టం నిర్వహించారు. లలితా సహస్రనామార్చన, బాలభోగ నివేదన, చండీహోమం, నవగ్రహహోమం, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి 24వ వార్షిక తిరు కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలించారు.

అమ్మవారి కళ్యాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణం అయ్యేవరకు మంత్రి అక్కడే ఉన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి మూడో రోజు గురువారం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల ప్రజలు వైభవంగా బోనాలు సమర్పించనున్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఏసి భాస్కర్, ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేదరక్షిత, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ఆలయ మాజీ చైర్మన్లు గోపాల్ రెడ్డి, యాదగిరి, ముత్తయ్య, ఆలయ అర్చకులు మల్లాచార్యులు, శ్రవణ కుమారాచార్యులు,

ఉమామహేశ్వర శర్మ, దామోదర శర్మ, నాగరాజు, ఫణి కుమార్, ఆలయ సిబ్బంది నాగేశ్వరరావు, కూసం ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, ఆలయ ధర్మకర్తలు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు