మౌలిక వసతుల కల్పనకు కస్తూరి ఫౌండేషన్ కృషి

మౌలిక వసతుల కల్పనకు కస్తూరి ఫౌండేషన్ కృషి

మిర్యాలగూడ నియోజక వర్గ ఫౌండేషన్ ఇంఛార్జి గుడిపాటి కోటయ్య

మిర్యాలగూడ, మనసాక్షి : గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మౌలిక వసతులు కల్పన కోసం మరియు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కస్తూరి ఫౌండేషన్ ఈ విద్యా సంవత్సరంలో అంగన్వాడి విద్యపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది.

దీనిలో భాగంగా గురువారం వేములపల్లి మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల మొల్కపట్నం లోని 120 మంది విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో ఇంఛార్జి గుడిపాటి కోటయ్య స్టడీ కిట్లు, పాఠశాలకు జాతీయ నాయకుల చిత్ర పటాలు, ఉపాధ్యాయులకు జూటు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.


ఈ సందర్భంగా గుడిపాటి కోటయ్య మాట్లాడుతూ విద్యార్థులు సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేని వారికి విద్య అందించాలనే లక్ష్యంతో ఫౌండేషన్ స్థాపించి గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కోసం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని భవిష్యత్తులో కూడా చేస్తామని అన్నారు.ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాలికలను దృష్టి అందించుకొని బాలికలకు సంబంధించినటువంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మెండె వెంకట్, వీరనారయణ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ , ఉపాధ్యాయులు రాజేశ్వరి, సరిత, నాగయ్య , మహేష్, రామకృష్ణ, నవీన్, చిన్న నవీన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.