Breaking NewsTOP STORIESఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభం.. కేసీఆర్ తొలి సంతకం ఆ ఫైలు పైన్నే..!
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభం.. కేసీఆర్ తొలి సంతకం ఆ ఫైలు పైన్నే..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం ప్రారంభోత్సవం అయింది. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఛాంబర్ లో సీఎం కుర్చీలో ఆసీనులయ్యారు. వేద మంత్రాల నడుమ సీఎం తన సీటులో కూర్చున్నారు.
మొదటగా నూతన సచివాలయంలో తొలి సంతకం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలు పై సంతకం చేశారు. వీటిలో మొత్తం ఆరు ఫైళ్లపై కెసిఆర్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు సిఎస్ శాంతి కుమారి డిజిపి కూడా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.










