కేసీఆర్ హాయంలోనే గిరిజన తండాల అభివృద్ధి

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

కేసీఆర్ హాయంలోనే గిరిజన తండాల అభివృద్ధి

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

మాడ్గుల, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండా అభివృద్ధిపథంలోకి వచ్చాయని, గిరిజన తాండాలని పంచాయతీ లుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.

 

మాడ్గుల మండలంలోని జరుపుల తండా, మక్తతండా , చెట్లగుట్ట తండా, కుబ్యాతాండ. పడమటి తండాల బీటీ రోడ్ల నిర్మాణం పనులకు. ఆదివారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ నుంచి మంజూరైన ఎస్ డి ఎఫ్ నిధులతో ప్రతి గిరిజన తండాకు లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

 

ALSO READ :

1. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

2. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

4. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

 

గిరిజన తండాలలో 50 సంవత్సరాలుగా తీరని సమస్యలను సీఎం కేసీఆర్ ఈ తొమ్మిది ఏళ్ళ కాలంలో తీర్చారని గిరిజన తండాలలో ఇంకా నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా పరిష్కరిస్తానని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పగడాల రవి, మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, సర్పంచులు. వాసు రామ్ నాయక్ ,హనుమాన్ నాయక్, జర్పు హీరా దేవి, లక్ష్మి ఎంపీటీసీ సభ్యులు బండారు సరితబ్రహ్మం గౌడ్,గ్యార వెంకటయ్య, కల్లు జ్యోతి రాజశేఖర్ రెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ రాజ వర్ధన్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.