Kcr : ఓటమిపై కేసీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ భవన్ సమావేశంలో వెల్లడి..!

ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ఇంకా వ్యతిరేకత పోలేదని  బి ఆర్ ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికలపై కరీంనగర్ పెద్దపల్లి నేతలతో సమావేశం నిర్వహించారు.

Kcr : ఓటమిపై కేసీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ భవన్ సమావేశంలో వెల్లడి..!

కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం

బస్సు యాత్ర కూడా నిర్వహిద్దాం

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ఇంకా వ్యతిరేకత పోలేదని  బి ఆర్ ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికలపై కరీంనగర్ పెద్దపల్లి నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని, గెలుపు ఓటములు సహజమని.. ఆయన అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి ప్రారంభిద్దామన్నారు. ఈనెల 12వ తేదీన కాలేజీ గ్రౌండ్స్ లో సభ నిర్వహించనున్ననట్లు ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం కచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. కరీంనగర్ లో బహిరంగ సభ తో పాటు బస్సు యాత్రలు కూడా చేద్దామని ఆయన తెలిపారు.  సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ తో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ALSO READ : Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ కు పోటాపోటీ.. గ్రూపుల లొల్లితో ఎమ్మెల్యేకు తలనొప్పి..!