Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ కు పోటాపోటీ.. గ్రూపుల లొల్లితో ఎమ్మెల్యేకు తలనొప్పి..!

Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ కు పోటాపోటీ.. గ్రూపుల లొల్లితో ఎమ్మెల్యేకు తలనొప్పి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ మిర్యాలగూడ నియోజకవర్గంలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్. దీనికి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వారంలో రెండుసార్లు ఈ మార్కెట్లో సంత నిర్వహిస్తుంటారు. సంత వల్ల కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. సంతలో వ్యాపారాలు కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లా నే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి క్రయవిక్రయాలు చేస్తుంటారు.

ఇదిలా ఉండగా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ నియామకంలో ఎప్పుడూ.. కిరికిరి ఉంటుందని చెప్పవచ్చును. బీఆర్ఎస్ హయాంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కి పోటాపోటీ ఉండడంతో అప్పటి ఎమ్మెల్యే భాస్కరరావు కు కూడా తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్కెట్ కమిటీని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు అన్ని రద్దయ్యాయి. అంతేకాకుండా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి జనరల్ మహిళకు రిజర్వేషన్లు కేటాయించారు. ఇంతవరకు బానే ఉంది. కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎవరిని నియమించాలని అంశంపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. నియోజకవర్గాలలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ అధిష్టానం చూస్తుందా..? లేక స్థానిక ఎమ్మెల్యే నియమిస్తాడా..? అనే అంశం కూడా ఇంకా తేటతెల్లం కాలేదు. దాంతో మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ పదవి సందిగ్ధంలో పడింది.

రేవంత్ రెడ్డిని కలిసిన మెజారిటీ ఎమ్మెల్యేలు :

రాష్ట్రంలోని తమ తమ నియోజకవర్గాలలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎమ్మెల్యేలకే ప్రధాన బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ఇటీవల మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యేకు కేటాయించాలని వారు విన్నవించారు. అలా అయితే మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి చేతిలో ఉంటుంది.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందా..?

నియోజకవర్గాలలో పార్టీ అభ్యున్నతికి కృషిచేసిన నాయకులకు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు అప్పగిస్తుంటారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు అప్పగించే బాధ్యత ఇస్తే పార్టీ నాయకత్వం ఏమైపోతుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు.

మిర్యాలగూడలో గ్రూపుల లొల్లి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల కంటే ముందు నుంచే గ్రూపుల లొల్లి కొనసాగుతుంది. ఎమ్మెల్యేగా భత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి విధితమే. అయినా కూడా ఇంకా గ్రూపుల లొల్లి కొనసాగుతూనే ఉంది. పార్టీ పదవుల విషయంలో ఇటీవల పార్టీ కార్యాలయంలోనే వివాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో గ్రూపుల లొల్లి కారణంగా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలనే అంశం సందిగ్ధంలో ఉంది.

ALSO READ : మిర్యాలగూడ : నకిలీ మందుల తయారీ గుట్టు రట్టు.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకాష్మిక తనిఖీలు పట్టుబడ్డ వైనం..!

బడా నేతల వైపు చూపు :

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు బడా నేతల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి జానారెడ్డి అనుచరులు జానారెడ్డి ప్రోద్బలంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వద్దకు వెళ్లి పదవి దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో జోక్యం కల్పించుకోవాలా? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ఈ గ్రూపుల లొల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది.

ఏది ఏమైనా పార్టీ కోసం పనిచేసిన వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నియామకం కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ALSO READ : Bjp First List : బిజెపి ఫస్ట్ లిస్ట్..!

మరిన్ని వార్తలు