మిర్యాలగూడ : నకిలీ మందుల తయారీ గుట్టు రట్టు.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకాష్మిక తనిఖీలు పట్టుబడ్డ వైనం..!

రాష్ట్రంలో నకిలీ మందులపై డ్రగ్స్ అధికారులు కొరడా జులిపించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, నల్గొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. వివిధ రకాల మందులను సీజ్ చేశారు.

మిర్యాలగూడ : నకిలీ మందుల తయారీ గుట్టు రట్టు.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకాష్మిక తనిఖీలు పట్టుబడ్డ వైనం..!

మిర్యాలగూడ, హైదరాబాద్ , మన సాక్షి :

రాష్ట్రంలో నకిలీ మందులపై డ్రగ్స్ అధికారులు కొరడా జులిపించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, నల్గొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. వివిధ రకాల మందులను సీజ్ చేశారు. తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న మందులను సీజ్ చేశారు.

హైదరాబాదులోని శాలిబండలో నకిలీ లేబుల్స్ తో ఆయిల్ నిల్వ చేస్తున్న ఓ ఇంట్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఉబకాయం జబ్బులు పోతాయి అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.

ఆ ఇంట్లో అయ్యో ఆర్గానిక్ హాల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ పేరిట నకిలీ లేబుల్ సృష్టించి మార్కెట్లోకి తీసుకొస్తున్నందున నకిలీ ఆయిల్స్ తయారు చేసే కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భారీగా ఆయిల్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 21000 ఉంటుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

అదేవిధంగా నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం ఇట్టిగూడెంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

షాపులో 41 రకాల నకిలీ టాబ్లెట్లను వారు సీజ్ చేశారు. వీటిలో సుమారు 45000 రూపాయలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పట్టుబడ్డ యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, అనాలిసిస్టిక్స్, దగ్గు మందులు, యాంటీ అలెర్సర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీ హైపర్టెన్సీ మందులను అధికారులు సీట్ చేశారు.

ALSO READ : KTR : మేడిగ‌డ్డ‌లో చిన్న స‌మ‌స్య‌.. భూత‌ద్దంలో పెట్టి పెద్ద‌దిగా చూస్తున్నారు..!